బాలయ్య నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ పై అప్పుడే.?

Published on Apr 22, 2021 3:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే పవర్ హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇక షూట్ అంతిమ దశలో ఉంది. మరి ఇదిలా ఉండగా బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి అని ఆల్రెడీ అనీల్, బాలయ్యకు ఓ సాలిడ్ స్క్రిప్ట్ లైన్ వినిపించగా బాలయ్య ఓకే కూడా చేసారని టాక్. మరి అంతా సెట్టయితే ఈ ప్రాజెక్ట్ రాబోయే బాలయ్య బర్త్ డే సందర్భంగానే లాంచ్ చేస్తారని తెలుస్తుంది. మరి దీని పై క్లారిటీ రావాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. అలాగే మరి ఈ కాంబో నిజంగానే సెట్టయితే ఎలాంటి బ్యాక్ డ్రాప్ తో వస్తారో అన్నది కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :