‘కథానాయకుడు’ కోసం కళ్యాణ్ రామ్, సుమంత్ కూడా !

Published on Jan 2, 2019 8:34 pm IST

బాలయ్య నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా చిత్రబృందం నిన్నటినుండే ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సుమంత్, కళ్యాణ్ రామ్ తో కలిసి బాలయ్య ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

కాగా తాజాగా ‘కథానాయకుడు’ సంబంధించి ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది బయోపిక్ టీమ్. ప్రోమోలో వచ్చే బాలయ్య మరియు విద్యాబాలన్ మధ్య డైలాగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్ లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం :