సాలిడ్ ఫిగర్ కు “అఖండ” ఈ రెండు హక్కులు.?

Published on Apr 20, 2021 3:01 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “అఖండ”. తన ఆల్ టైం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో విడుదల చేసిన టీజర్ మరిన్ని అంచనాలు పెంచింది. అందుకే అక్కడ నుంచి ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్ళింది.

అయితే ఈ అనుసారం ఈ చిత్రం తాళక డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్టార్ మా వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు హక్కులకు సంబంధించి బాలయ్య కెరీర్ లోనే ఏ సినిమాకు పలకని ధర పలికినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి ఈ రెండు హక్కులు కలిపి 13 నుంచి 15 కోట్ల మధ్యలో డీల్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :