మాస్ రేజ్ చూపిస్తున్న బాలయ్య “అఖండ” టీజర్.!

Published on Apr 25, 2021 9:12 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం లేటెస్ట్ టీజర్ యూట్యూబ్ లో మామూలుగా రచ్చ లేపట్లేదని చెప్పాలి. అంతకంతకు స్పీడ్ అందుకుంటుంది తప్పితే అలుపనేదే ఈ టీజర్ కు కనిపించడం లేదు.

జస్ట్ 11 రోజుల్లోనే మన సౌత్ ఇండియా సీనియర్ హీరోల అన్ని టీజర్ రికార్డులు బద్దలు కొట్టేసిన ఈ టీజర్ ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు తిరగకుండానే 2 మిలియన్ వ్యూస్ సాధించి మన టాలీవుడ్ ఫాస్టెస్ట్ 40 మిలియన్ టీజర్ క్లబ్ లో చేరిపోయింది. మరి ఇదే స్పీడ్ కనుక కొనసాగితే 50 మిలియన్ లో కూడా చేరిపోవడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇవ్వగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :