క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ !

Published on Mar 28, 2019 5:25 pm IST

నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. అది మీడియా వారకి. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న బాలయ్య ఎన్నికల ప్రచారం చేస్తూ… వీడియో తీస్తున్నాడని ఓ మీడియా ప్రతినిధిని కొట్టినట్లు ఓ వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీని పై స్పందించిన బాలయ్య అది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

బాలయ్య పోస్ట్ చేస్తూ.. ‘‘మీడియా మిత్రులకి నమస్కారం.. నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :