యాక్షన్ తోనే స్టార్ట్ చేయనున్న బాలయ్య.!

Published on Jun 23, 2021 9:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటెర్టైనెర్ “అఖండ”. బాలయ్య హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పటికే ఆల్ మోస్ట్ కంప్లీట్ కాగా మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇది కూడా షూట్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ బ్యాలన్స్ షూట్ స్టార్టింగ్ ను కూడా బాలయ్య అదిరే యాక్షన్ సీక్వెన్స్ తోనే మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఈ చిత్రం షూట్ వచ్చే జూలై నుంచి రీస్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ భారీ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :