బాలయ్య గుండు లుక్‌ లో కనిపిస్తోంది అందుకేనట !

బాలయ్య గుండు లుక్‌ లో కనిపిస్తోంది అందుకేనట !

Published on Feb 12, 2020 11:20 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ నెల 26 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడట. అందుకే బాలయ్య గుండు లుక్‌ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లో ఈ ఫ్యాక్షనిస్ట్ రోల్ కు సంబధించిన పార్ట్ నే షూట్ చేస్తారట. అలాగే సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆధ్యాత్మికతతో మొదలై ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే బాలయ్య అసలు అఘోరాగా ఎలా మారాడు ఆయన గతం ఏమిటి అనే కోణంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా వస్తోందట. అయితే సినిమాలో ఎప్పటిలాగే ఇద్దరు బాలయ్యలు కనిపించనున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు