బాలయ్య మూవీలో మళ్ళీ ఆ హీరోయినే నటిస్తుందా..?

Published on Jun 18, 2019 11:03 pm IST

బాలకృష్ణ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని అధికారికంగా మూవీని లాంచ్ చేశారు. నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘క్రాంతి’ అలాగే ‘రూలర్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

ఐతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉండగా ఒక హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటించే అవకాశం కలదని సమాచారం. దర్శక నిర్మాతలు ఆమె పేరును పరిశీలుస్తున్నారట. ఇదే కనుక జరిగితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం అవుతుంది. బాలకృష్ణ ,శ్రీయా మొదటిసారిగా “చెన్నకేశవ రెడ్డి” మూవీలో నటించగా తరువాటా “గౌతమీ పుత్ర శాతకర్ణి”, “పైసా వసూల్” చిత్రాలతో కలిసి నటించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More