‘ఇరుముడి’ దర్శకుడితో బాలయ్య ?

‘ఇరుముడి’ దర్శకుడితో బాలయ్య ?

Published on Aug 31, 2026 9:59 AM IST

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఇంకా బలంగా కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఇతర చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకుంది. ఐతే, ఈ సినిమా విజయంలో దర్శకుడిగా శివ నిర్వాణ పాత్ర చాలా కీలకం. ప్రేక్షకులు సినిమా చూసి ఎమోషనల్ అవుతున్నారు అంటే..శివ నిర్వాణ రాసిన డైలాగ్స్ అండ్ సీన్లు చాలా బలంగా ఉండటమే కారణం.

ఐతే, ‘ఇరుముడి’ తర్వాత శివ నిర్వాణ ఏ హీరోతో సినిమా చేస్తే బాగుంటుంది ?, ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది ? అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ‘ఇరుముడి’ యాక్షన్ సీక్వెన్స్ లు చూశాక, బాలయ్యతో ఓ బలమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా చేస్తే అదిరిపోతుందని బాలయ్య అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. బాలయ్య పై ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హీరోయిజం మిక్స్ చేస్తే సినిమా అదరిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కలయికలో సినిమా వస్తోందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు