బాలయ్య ‘అఖండ’ రిలీజ్ పరిస్థితేంటి ?

Published on Aug 23, 2021 8:40 pm IST

నటసింహం బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ సినిమా‌ రిలీజ్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందని అంటున్నా క్లారిటీ లేదు. మరోపక్క డిసెంబర్ కి అఖండ రెడీ అవుతుంది అని టాక్ నడుస్తోంది. మరి అఖండ రిలీజ్ పై బోయపాటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

నిజానికి దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్టోబర్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇక ఈ సినిమా కోసమైతే నంద‌మూరి అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

అన్నట్టు బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే యాక్షన్ ఉండాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటారు. అందుకే ఈ సినిమా యాక్షన్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి ఫైట్స్ ను కంపోజ్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :