ఎన్టీఆర్ 60 గెటప్‌లు, ఏఎన్నార్ 8 గెటప్‌లు అట !

ఎన్టీఆర్ 60 గెటప్‌లు, ఏఎన్నార్ 8 గెటప్‌లు అట !

Published on Sep 27, 2018 3:20 AM IST

‘నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ ఎన్టీఆర్ జీవితకథను దర్శకుడు క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో 60 విభిన్న గెటప్‌ లలో బాలకృష్ణ కనిపించనున్నారు.

కాగా ఈ చిత్రంలో ఏఎన్నార్‌ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్‌ ఉందట. అక్కినేని వారసుడు సుమంత్‌ తన తాతగారు నాగేశ్వరరావుగారి పాత్రలో నటిస్తున్నారు. సుమంత్ కూడా ఈ చిత్రంలో దాదాపు 8 డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ ల బంధాన్ని చూపించనున్నారు.

కాగా నవంబర్ కల్లా టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు