కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జనవరి మొదటి వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ పై కొరటాల ఇప్పటికే కసరత్తులు కూడా మొదలుపెట్టారట. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
సంయుక్త మీనన్ గతంలో ‘అఖండ 2’లో కూడా బాలయ్యతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా హార్డ్ వర్క్ చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


