‘రాకా’ ఫ్లాష్‌ బ్యాక్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘రాకా’ ఫ్లాష్‌ బ్యాక్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 29, 2026 8:02 AM IST

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సినిమా కోసం ప్రత్యేకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను కూడా సిద్ధం చేస్తునట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ యాక్షన్ షెడ్యూల్ ఫ్లాష్‌ బ్యాక్ లో వస్తోందట. ఇక ఈ సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.

కాగా డిసెంబర్ రెండో వారం లోపు ఈ సినిమా చిత్రీకరణను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు