రెండున్నరకు దగ్గర్లో మహేష్, మూడున్నరకు చేరువలో చరణ్ !
Published on Apr 23, 2018 5:09 pm IST


గత నెల 30న విడుదలైన రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ చిత్రం తెలుగునాట మాత్రమే కాకుండా విడుదలైన అన్ని చోట్ల ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో సినిమాకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. మొదటి మూడు రోజుల్లోనే 2.32 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం 3.44 డాలర్ల వద్ద ఉండి మూడున్నర మిలియన్ అందుకునే దిశగా వెళుతోంది.

ఇక మూడు రోజుల క్రితం వచ్చిన మహేష్, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ సైతం బ్రహ్మాండంగా నడుస్తోంది. మొదటి రోజు 1.36 మిలియన్ డాలర్లను అందుకున్న ఈ పొలిటికల్ డ్రామా మూడు రోజుల్లోనే 2.48 మిలియన్ డాలర్లను రాబట్టి రెండున్నర మిలియన్లకు అతి చేరువలో ఉంది. ఇప్పటికే ‘రంగస్థలం’ నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయగా ‘భరత్ అనే నేను’ కూడ త్వరలోనే ‘రంగస్థలం’ కు చేరువుగా వెళ్లనుంది.

ఇలా పోటా పోటీగా నడుస్తున్న ఈ రెండు చిత్రాలు ఫుల్ రన్ ముగిసేసరికి ఎంత వసూళ్లు సాదిస్తాయో చూడాలని ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఉన్నారు.

 
Like us on Facebook