సెన్సార్ పనులకు సిద్దమైన భరత్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ భరత్ అనే నేను ఈ నెల 20 వ తేదీన విడుదల కాబోతోన్న సంగతి అందరికి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు ముందే సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ సినిమా పై ప్రస్తుతం అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పాటలతో పాటు ట్రైలర్ కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దీంతో తప్పకుండా సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని టాక్ వస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా సెన్సార్ పనులు రేపు జరగనున్నాయి. అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లను చిత్ర నిర్మాత డివివి.దానయ్య రెడీ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహేష్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.