
అల్లరి నరేష్, ఈషా జంటగా నటించిన చిత్రం ‘బందిపోటు’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరి స్వరపరిచిన గీతాలు గత నెలలో విడుదలయ్యాయి. ఈ చిత్ర ఆడియో ప్రేక్షకుల నుండి మంచి స్పందన స్పందన లభించింది. ఆడియో విజయవంతమైన సందర్భంగా ఈ నెల 15వ తేదిన విజయవాడలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహిస్తున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది.
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఓ ప్రత్యేక గీతంలో శ్రద్ధా సందడి చేయనుంది. ఆడియో విజయవంతం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అర్బన్ బేస్డ్ క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందకు వస్తుంది.