పవన్ సినిమా.. నిజం కాదంటున్న బండ్ల

Published on May 19, 2021 2:00 am IST

నిర్మాత బండ్ల గణేష్ మరోసారి యాక్టివ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని ఆయన గట్టిగా ట్రై చేస్తున్నారు. మరోసారి ‘గబ్బర్ సింగ్’ విజయాన్ని రిపీట్ చేయాలని తహతహలాడుతున్నారు. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం వెంటనే సినిమాను మొదలుపెట్టేసే హుషారులో ఉన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ బండ్లకు డేట్స్ అయితే కేటాయించలేదు కానీ సినిమా చేయడం అనేది మాత్రం కన్ఫర్మ్. అందుకే వీరిద్దరి సినిమా మీద రకరకాల వార్తలు పుడుతున్నాయి.

తాజాగా డైరెక్టర్ రమేష్ వర్మ పవన్ ను డైరెక్ట్ చేయనున్నారని, ఆ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తారని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే బండ్ల గణేష్ వాటిని ఖండించారు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని, నిజంగా సినిమా ఫైనల్ అయితే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో రూమర్లను చెక్ పడి పవన్ అభిమానులకు ఒక క్లారిటీ దొరికేసింది. ఇకపోతే రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజతో ‘ఖిలాడి’ సినిమా చేస్తుండగా పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి.

సంబంధిత సమాచారం :