ఎన్టీఆర్‌తో విబేధాలపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్..!

Published on Aug 31, 2021 10:25 pm IST

ప్రముఖ సినీ నిర్మాతకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు వచ్చాయని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌తో బండ్ల గణేశ్ ‘బాద్‌ షా’, ‘టెంపర్‌’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్‌ మూవీ రెమ్యునరేషన్‌ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని చాలా చెప్పుకున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన బండ్ల గణేశ్ అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్నపాటి మనస్పర్థలను గొడవలు అని అనలేమని, మా ఇద్దరి మధ్య కేవలం మిస్‌ కమ్యునికేషన్‌ మాత్రమే జరిగిందని అంతే తప్పా ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని అన్నాడు. అయితే నిర్మాతగా మళ్లీ బిజీ అవుతున్న బండ్ల గణేశ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మున్ముందు జూనియర్‌తో కూడా సినిమా చేస్తాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత సమాచారం :