ప్రభాస్, రాజమౌళిలపై బండ్ల గణేష్ అద్భుత కామెంట్స్.!

Published on Jun 25, 2021 1:00 pm IST

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హీట్ మొదలయ్యింది. మొన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ల నడుమ పోటీతో టాలీవుడ్ వర్గాల్లో ఓ రేంజ్ హాట్ టాపిక్ అవుతున్న ఈ ఎన్నికలు ఇపుడు ఒకో ప్యానెల్ నుంచి ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ప్రకాష్ రాజ్ కు మద్దతుగా అనేక మంది ప్రముఖ సినీ నటులు రాగా వారిలో ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ మంచి హైలైట్ అయ్యాయి.

లోకల్ నాన్ లోకల్ అనే ప్రస్తావనలో ప్రకాష్ రాజ్ పేరుపై ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇప్పుడు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్నాడని అలాగే ఇక్కడే పుట్టిన రాజమౌళిని హాలీవుడ్ సినిమాలు చెయ్యమని అడుగుతున్నారు. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏమిటి అని బండ్ల గణేష్ తన మార్క్ కామెంట్స్ చెయ్యడం ఓ పక్క ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మరియు సినీ ప్రేమికులకు మంచి జోష్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో హైలైట్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :