బండ్ల కి రెండోసారి కరోనా..చివరి నిమిషంలో ఆదుకున్న

Published on Aug 29, 2021 5:30 pm IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. ఇటీవల హీరోగా కూడా ఒక సినిమా చెయ్యడానికి బండ్ల ఓకే చెప్పారు. మరి నటునిగా మరోపక్క నిర్మాతగా అంతకు మించి బిజినెస్ మెన్ గా బండ్ల బిజీ బిజీగా ఉన్నారు. అయితే అలాంటి తారతమ్యాలు ఏమీ తెలీని కరోనా ప్రతీ ఒక్కరిని ఎంతో క్షోభకి గురి చేసింది. దీని బారిన బండ్ల గణేష్ ఓసారి ఆల్రెడీ చిక్కుకున్న సంగతి తెలిసిందే. కానీ అందరికీ తెలియని ఓ విషయాన్ని బండ్ల గణేష్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో తెలియజేసారు. తనకి రెండో సారి కూడా కరోనా అటాక్ అయ్యిందట.

తన ఇంట్లో తనతో పాటుగా భార్య పిల్లలకి కూడా సోకింది అని తెలియజేసారు. అయితే 80 శాతం వరకు తన ఊపిరితిత్తులు చెడిపోగా ఆ సమయంలో ఏ హాస్పిటల్ కి కాల్ చేసినా తనకి తెలిసిన వారికి అడిగినా ప్రయోజనం లేకపోయింది అని పోనీ తన దేవర పవన్ కళ్యాణ్ ని అడుగుదాం అంటే అప్పటికే అతనికి కూడా కరోనా సోకి ఉందని తెలిపారు. మరి ఇంకాస్త లేట్ అయ్యి ఒక్క రోజు అయితే చచ్చిపోతాను అన్నపుడు మెగాస్టార్ చిరంజీవికి కాల్ చెయ్యగా విని ఫోన్ పెట్టేసారు.

ఆ తర్వాత 2 నిమిషాల్లో మళ్ళీ కాల్ వచ్చి వెంటనే అపోలోలో జాయిన్ అవ్వమని చెప్పి జాయిన్ చేసారని బండ్ల తెలిపారు. అంతే కాకుండా చికిత్స పొందుతున్న సమయంలోనే కొన్ని వందలసార్లు కాల్ చేసి నా యోగ క్షేమాల కోసం కనుక్కున్నారని బండ్ల గణేష్ తెలిపారు. ఆ సమయంలో కనుక మెగాస్టార్ సాయం చెయ్యకుండా ఉంటే ఇప్పుడు బండ్ల గణేష్ ఉండేవాడు కాదని ఎవరికీ తెలియని విషయాన్ని తెలిపారు. దీనితో కనిపించని మెగాస్టార్ ఉదారత ఇలా బయటపడింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :