నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష

నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష

Published on Nov 18, 2026 11:58 PM IST

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల కాలంలో అనేక ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి విచారణ జరిపిన ఒంగోలు న్యాయస్థానం, బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తాజాగా సంచలన తీర్పును వెలువరించింది.

మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేష్ చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా ఆయన డబ్బులు చెల్లించకపోవడంతో, బాధితుడు 2019లో కోర్టును ఆశ్రయించారు. గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ నేటితో ముగియగా, న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. అయితే, ఈ జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు నెల రోజుల గడువు లభించింది.

తాజా వార్తలు