సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రమే ‘వారణాసి’. ఇండియన్ సినిమా నుంచి రెండో పూర్తి స్థాయి ఐమాక్స్ సినిమాగా నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
కానీ మేకర్స్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నారనే టాక్ ఊపందుకున్న నేపథ్యంలో ఈసారి మహేష్ బర్త్ డే కి దగ్గరలో సినిమా ఉంటుంది అని రూమర్స్ వినిపించాయి. కానీ లేటెస్ట్ గా డేట్ అయితే లాక్ అయినట్టు సినీ వర్గాల్లో బిగ్ బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ 2027 జూలై 30న విడుదల చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్టుగా టాక్. సో జూలై ఎండింగ్ ఆ తర్వాత 9 రోజుల్లోనే సూపర్ స్టార్ బర్త్ డే ఉండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతకు మించిన బెస్ట్ రిలీజ్ ఉండదని చెప్పొచ్చు. ఇక ఈ కొత్త డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.


