ఒకప్పుడు టాలీవుడ్‌కు సమ్మర్ సెలవులు అతిపెద్ద బాక్సాఫీస్ సీజన్‌గా ఉండేవి. కానీ ఐపీఎల్ క్రేజ్ పెరిగినప్పటి నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రికెట్ మ్యాచ్‌ల ప్రభావంతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుండటంతో, పెద్ద సినిమాలన్నీ సమ్మర్ రేసు నుంచి తప్పుకుని సంక్రాంతిపై దృష్టి సారించాయి. ఇదే కోవలో, దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా ఆ తేదీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘మగధీర’ విడుదలైన సెంటిమెంట్ తేదీ అయిన జులై 31కి ఈ సినిమాను వాయిదా వేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ పాన్-ఇండియా చిత్రం వాయిదా పడటానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రభావమేనని ఇన్‌సైడ్ వర్గాల టాక్. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ మెట్రో నగరాల్లో ఐపీఎల్ సమయంలో సాయంత్రం షోలకు థియేటర్లు వెలవెలబోతుంటాయి.
నార్త్ బిజినెస్‌పై భారీగా గురిపెట్టిన రాజమౌళి, ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట. మరి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా తన సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని చూస్తున్నాడంటే, ఐపీఎల్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


