పవన్ కు కథ వినిపించబోతున్నారు !

Published on Oct 26, 2020 5:32 pm IST

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కోసం బండ్ల గ‌ణేష్ ప్రస్తుతం కథను వెతికే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలో ఓ కొత్త రచయిత దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు.. త్వరలోనే పవన్ కు కూడా ఆ కథను వినిపించనున్నారని తెలుస్తోంది. కథలో పవన్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని సమాచారం. మరి ఈ కథ గాని పవన్ కు నచ్చితే.. ఈ సినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే డైరెక్టర్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు.

అయితే కాలేజీ నేపథ్యంలో పవన్ సినిమా అంటే.. పైగా పవన్ లెక్చరర్ పాత్ర అంటే.. సినిమా పై ఆసక్తి రెట్టింపు అయ్యేలా ఉంది. ఏమైనా బండ్లకు పవర్ స్టార్ మళ్లీ ఓ సినిమాని నిర్మించే అవకాశం ఇవ్వడం విశేషమే. అన్నట్లు ఆ మధ్య ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – పరుశురామ్ కాంబినేషన్ లో బండ్ల గ‌ణేష్ సినిమా ప్లాన్ చేసాడని.. ‘సర్కారు వారి పాట’ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చినా, ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు తెలసిన విద్యే కాబట్టి.. ఈ సినిమా కోసం ఏ స్టార్ డైరెక్టర్ ను తీసుకొస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More