ఓటిటి సమీక్ష: ‘ప్రేమ రేఖ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ప్రేమ రేఖ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Feb 23, 2026 7:29 AM IST

premalea

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : షాయాజీ షిండే, దీప శంకర్, శివ శక్తి, సాత్విక్ బసవరాజు తదితరులు
దర్శకత్వం : ఉమర్జీ అనురాధ
నిర్మాత : నాహుషి కావూరి
సంగీతం : విక్రమ్ సెల్వ
సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణియం
ఎడిటింగ్ : ప్రణీత్ కుమార్, రమేష్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త ఎపిసోడ్ నే ‘ప్రేమ రేఖ’. మరి ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక చిన్న పల్లెటూరులో సింపుల్ జీవనాన్ని సాగించే చిన్న కుటుంబంలో తన కూతురు సుమ (శివ శక్తి) ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తారు శివ (షాయాజీ షిండే). అయితే తన కూతురు పై చదువులు కోసం చెన్నై వెళ్లాల్సి వస్తుంది. కానీ వెళ్లే ముందు రెండు ఆప్షన్స్ ఆమె ముందు ఉంచి ఒకటి ఎంచుకోమంటారు. అందులో ఆమె ఫ్రీడమ్ కోసం తండ్రి చెప్పినట్టు గానే మాట ఇచ్చి ఎవరిని చూస్తే వారినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. కానీ చెన్నైలో ఆర్య (సాత్విక్ బసవరాజు) అనే కుర్రాడు పరిచయం అవుతాడు. ముందు అతనితో నాన్నకి ఇచ్చిన మాటకు కట్టుబడి దూరం పెడుతుంది కానీ నెమ్మదిగా అతని మనసుకి దగ్గరవుతుంది. అలా పెళ్లి వరకు వెళ్లిన జంట పెళ్లి చేసుకున్నారా లేదా? సుమ తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఏం చేసింది? చివరికి ఈ కథ ఎలా సుఖాంతం అయ్యింది అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో దాదాపు అన్ని అంశాలు ప్యాకెడ్ అండ్ పక్కాగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. పల్లెటూరు నేపథ్యం నుంచి సిటీ వరకు అలాగే నీట్ సంగీతంతో వర్క్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. వీటితో పాటుగా షాయాజీ షిండే సుమ రోల్స్ నడుమ తండ్రీకూతుళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. వీటిని దర్శకురాలు బాగా మైంటైన్ చేశారు.

అలాగే ఈ ఇద్దరితో పాటుగా నటి దీప శంకర్ నడుమ కొన్ని కామెడీ సీన్స్ డీసెంట్ గా అనిపిస్తాయి. ఇక ఆ తర్వాత కథనం చెన్నైకి షిఫ్ట్ అయ్యాక కూడా డీసెంట్ గా తీసుకెళ్లారు. అక్కడ నుంచి యాడ్ అయ్యిన యువ నటుడు ఆర్య బాగా చేసాడు. తనకిది డెబ్యూ అయినప్పటికీ నీట్ గా పెర్ఫామ్ చేసాడు తన రోల్ లో.

అలానే శివ శక్తితో లవ్ ట్రాక్ కూడా ఎక్కడా ఓవర్ గా లేకుండా క్లీన్ గా కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ ఇందులో చాలా వరకు ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వొచ్చు. సుమ ఒక కీలక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా దీనికి ఒక మంచి ముగింపు ఇస్తారు అనే ప్రశ్నకి దర్శకురాలు అనురాధ తన బ్రిలియెన్స్ చూపించి చక్కటి ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆమె మ్యూజిక్ టేస్ట్ కూడా ఈ లఘు చిత్రంలో బాగుంది. అంతే కాకుండా ఈరోజుల్లో తండ్రి చాటున ఉండే అమ్మాయిలు వారి నుంచి బయటకి వచ్చిన తర్వాత తన తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని చెరపకుండా ఉండే ఒక స్ట్రాంగ్ అమ్మాయి పాత్రని ఆమె డిజైన్ చేసి ఇంప్రెస్ చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో సెటప్ అంతా నీట్ గానే ఉన్నప్పటికీ కొన్ని అంశాలు లోపంగా అనిపిస్తాయి. కథనం ముందే ఊహించవచ్చు. తండ్రి కట్టుబాట్లులో నుంచి వెళ్లిన అమ్మాయి ఎవరొకిరిని ప్రేమిస్తుంది అనే అనుకుంటాం. సరిగ్గా ఇదే జరుగుతుంది. అలాగే తన కూతురు దగ్గరే అగ్రిమెంట్ తీసుకునే సీన్ వంటివి ఊహాజనితంగానే అనిపిస్తాయి.

అలాగే ఈ లఘు చిత్రం మొత్తం చూసిన తర్వాత లీడ్ జంట లవ్ ట్రాక్ దాని ముగింపు చూస్తే కింగ్ నాగ్ మనం చిత్రంలో నాగార్జున, శ్రేయ లవ్ ట్రాక్ గుర్తు రాక మానవు. అలానే ఇద్దరి లవ్ ట్రాక్ ని ఇంకొంచెం మెచ్యూర్ గా ప్లాన్ చేయాల్సింది. హీరోయిన్, హీరో అంటే లోలోపల ఇష్టం ఉన్నప్పటికీ బయట లేదు అన్నట్టే ఉంటుంది.

అలాగే హీరో కూడా ఆమె వెంట తిరుగుతాడు ఎక్కడా హద్దులు దాటడు కానీ ఒక్క చోట ఆమె అనుమతి లేకుండానే ఆమె చేతిని పట్టుకుంటాడు. ఇక్కడ ఒకటి.. అయితే అంట స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయి అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ అయినా ఇచ్చి ఉండాలి లేదా ఆమెని ముట్టుకోకుండా అతడు ఆమెని ఆపేలా అయినా సన్నివేశం పెట్టి ఉంటే ఇంకా అర్ధవంతంగా ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నీట్ సెటప్, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. అయితే కెమెరా వర్క్ బాగుంది కానీ టోన్ ని కలర్ ఫుల్ గానే ఉంచితే చూసే విజువల్ లో మరింత లైఫ్ కనిపించేది బట్ బానే ఉంది. అలాగే సంగీతం మరో మేజర్ ఎసెట్. ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది. హీరోపై ఓ లవ్ సాంగ్ కి బెటర్ కొరియోగ్రఫీ ట్రై చేయాల్సింది.

ఇక దర్శకురాలు ఉమార్జి అనురాధ విషయానికి వస్తే.. పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పిన విధంగా తన వర్క్ ఇందులో డీసెంట్ గా ఉంది. చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కానీ తాను ఎంచుకున్న పాయింట్ కి తగ్గట్టుగా డీసెంట్ సీన్స్ అండ్ కథనాన్ని ఆమె రాసుకున్నారు. సో ఓవరాల్ గా ఆమె పనితనం ఈ లఘు చిత్రంలో మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ప్రేమ రేఖ’ తండ్రీ కూతుళ్ళ నడుమ ఒక స్వచ్ఛమైన ప్రేమానుబంధంని ప్రతిబింబించేలా చేస్తుంది. అలానే సుమ పాత్రని కూడా దర్శకురాలు ప్రస్తుత రోజుల్లో కొందరు అమ్మాయిలకి మంచి సందేశం ఇచ్చే రీతిలో డిజైన్ చేశారు. పైగా ఒక అందమైన ప్రేమ కథని ఓ కండిషన్ (రేఖ) గీసి బాగా ప్రెజెంట్ చేశారు. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే కుటుంబంతో ఈ లఘు చిత్రాన్ని చూడవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు