మహేష్ సినిమాలో బెంగుళూరు భామకి ఆఫర్

మహేష్ సినిమాలో బెంగుళూరు భామకి ఆఫర్

Published on May 12, 2015 7:20 PM IST

mahesh-babu
చాలా కాలం క్రితమే సినిమా పూర్తయినప్పటికీ రిలీజ్ కి నోచుకోని సినిమా ‘ఇంటింటా అన్నమయ్య’. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సిన హీరోయిన్ సనమ్ శెట్టి. కానీ ఈ సినిమా వాయిదా పడడంతో ఆ భామ మొదటి సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా ఈ భామకి ఓ బంపర్ ఆఫర్ దక్కింది. అదే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఓ కీలక పాత్రలో నటించే చాన్స్ కొట్టేయడం. మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ మంతుడు'(వర్కింగ్ టైటిల్). ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే సనమ్ శెట్టికి ఈ ఈ సినిమాలో నటించే అవకాశం లభించడం విశేషం.

ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ మూవీ యూనిట్ మెంబర్స్ సనమ్ శెట్టి ఫోటోగ్రాఫ్స్ ని కొరటాల శివకి చూపించారు. కొరటాల శివ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సనమ్ శెట్టిని ఓకే చేసేసాడు. ఈ విషయం తెలియడంతో సనమ్ శెట్టి చాలా ఉత్కంఠకి లోనైంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సనమ్ శెట్టి ‘మహేష్ బాబు చాలా సింపుల్ పర్సన్, సెట్లో అందరినీ చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటారని’ అంటోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ని మే 31న రిలీజ్ చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు