“బంగార్రాజు” ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!

“బంగార్రాజు” ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!

Published on Feb 19, 2022 10:00 PM IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ చిత్రం నిన్నటి నుంచి ‘జీ 5’ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

అయితే జీ5 తెలుగులో ఈ చిత్రం 24 గంటల్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఏదేమైనా బిగ్ స్క్రీన్‌పైనే కాకుండా డిజిటల్ వేదికగా కూడా బంగార్రాజు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. ఇకపోతే ఇందులో నాగ్ సరసన జోడీగా రమ్య కృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టిలు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు