యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చైతూ-కృతి మధ్య సాగే మెలోడీ..!

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చైతూ-కృతి మధ్య సాగే మెలోడీ..!

Published on Dec 6, 2021 11:57 PM IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న తాజా చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది.

అయితే ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా విడుదలైన ‘నా కోసం’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. నాగ చైతన్య, కృతిశెట్టి మధ్య సాగే ఈ లవ్ మెలోడీ ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్‌ని రాబట్టగా, 100K ప్లస్ లైక్స్‌ని సాధించింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు