వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “బంగార్రాజు”

Published on Mar 13, 2022 8:48 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వచ్చిన ఈ చిత్రం తో మరోసారి సెన్సేషన్ సృష్టించడం జరిగింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు మరొకసారి ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది. త్వరలో ఈ చిత్రం జీ తెలుగు లో ప్రసారం కానుంది. బుల్లితెర పై ఈ చిత్రం ఏ తరహా రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :