పుష్ప లో బన్నీ లుక్ కేక..!

Published on Apr 8, 2020 9:21 am IST

కరోనా లాక్ డౌన్ టైమ్ లో బన్నీ క్రేజీ అప్డేట్ తో వచ్చేశారు. అయన 20వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు అల్లు అర్జున్ బర్త్ డే ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఎప్పటిలాగే బన్నీ మరో ఆసక్తికర టైటిల్ ప్రకటించారు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీకి పుష్ప అనే టైటిల్ నిర్ణయించారు. ఇక బన్నీ లుక్ చాల రఫ్ అండ్ మాస్ అప్పీరెన్స్ కలిగివుంది. బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే రంగస్థలం వలె, ఇది కూడా పీరియడ్ డ్రామానా అనే డౌట్ కొడుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.సుకుమార్ ఈ మూవీని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. ఏదిఏమైనా బన్నీ సుకుమార్ లు ఫస్ట్ లుక్ తో మూవీపై అంచనాలు పెంచేశారు.

సంబంధిత సమాచారం :

X
More