మహేష్ ఒక చోటైతే.. బన్నీ నాలుగు చోట్ల..!

Published on Jan 18, 2020 7:14 am IST

సంక్రాంతి సినిమాల సక్సెస్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ ఐపోయాయి. పండక్కి అందిన బ్లాక్ బ్లస్టర్ హిట్స్ నీ హీరోలు అభిమానులతో కలిసి గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. గత రాత్రి వరంగల్ జిల్లా హన్మకొండ వేదికగా మహేష్ అండ్ టీమ్ సరిలేరు నీకెవ్వరు విజయాన్ని జరుపుకున్నారు. వేలాదిగా వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల షేర్ సాధించినందుకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇక సంక్రాంతికి వచ్చిన మరో పెద్ద సినిమా అల వైకుంఠపురంలో. బన్నీ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీలా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా వెళుతుంది. యూఎస్ లో $2 మిలియన్ మార్క్ వసూళ్లను చేరుకుంది. దీనితో అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ భారీ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈనెల 19న బీచ్ సిటీ గా పేరున్న వైజాగ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అలాగే 24న తిరుపతిలో మరో మారు విజయోత్సవ వేడుకలు జరుపనున్నారు. మరియు కర్ణాటక, కేరళలో కూడా సక్సెస్ మీట్స్ ప్లాన్ చేశారట. ఇలా మహేష్ ఓ చోట ప్లాన్ చేస్తే, బన్నీ నాలుగు చోట్ల జరపడానికి సిద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం :