దర్శక దిగ్గజం, చిత్రకారుడు, రచయత అయిన బాపు గతకొన్ని రోజులక్రితం తుదిశ్వాస విడిచారు. ఈయనను స్పురించుకుంటూ నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నివాళిని అర్పించారు
పలు సినిమా ప్రముఖులు బాపు గారితో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు ఆ జ్ఞాపకాల ఉచ్చులో పడి కన్నీటి పర్యంతం అయ్యారు. బాపుగారి అంత్యక్రియలు ఈ మంగళవారం జరిగాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఫిలిం ఛాంబర్ సభ్యులు తెలుగుతనానికి వన్నె తెచ్చిన బాపు గారికి ఘనమైన జ్ఞాపకాలు కల్పించాలని భావిస్తున్నాయి


