“పుష్ప” కు అసలు సంబంధమే లేని గాసిప్ అది.!

Published on Apr 30, 2021 2:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బన్నీకి కోవిడ్ వల్ల బ్రేక్ తీసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ ఊహించని గాసిప్ వైరల్ అవుతుంది.

దాని ప్రకారం మన ఇండియన్ ఐకానిక్ దర్శకుడు మణిరత్నం తీసిన విలన్ కు కాన్సెప్ట్ మార్చి సుకుమార్ తీస్తున్నారని టాక్ మొదలయ్యింది. అయితే ఈ రెండు ఫారెస్ట్ డ్రామాలే కావడంతో ఈ కొత్త రూమర్ స్టార్ట్ చేసారు. అయితే అసలు ఇది బేస్ లెస్ అని చెప్పాలి. అసలు పుష్ప టేకింగ్ గాని ఇతర మేకింగ్స్ కానీ చూస్తే అసలు ఎక్కడా కూడా విలన్ ఛాయలే ఉండవు..

సినిమాటోగ్రఫీ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నదాన్ని తీసుకొచ్చి లింక్ చేస్తున్నారు. ఇదెక్కడి లాజిక్కో అర్ధం కానిది సో అసలు ఈ కథకు ఆ కథకు సంబంధమే లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం అన్ని కీలక భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :