బర్నింగ్ స్టార్ ‘బజార్ రౌడీ’గా వచ్చేస్తున్నాడు..!

Published on Aug 8, 2021 3:00 am IST

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బజారు రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ రౌడీగా నవ్వులు పూయించబోతున్నాడు. అంతేకాకుండా పాటలు, డ్యాన్సులు, ఫైట్లు కూడా ఆకట్టుకోనున్నట్టు తెలుస్తుంది.

అయితే సంపూ కెరియర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తుంది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రాన్ని ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రంలో షియాజీ షిండే, పృథ్వీ, నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాయగా ఇవి మెయిన్ హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :