సంపూర్ణేశ్ “బజార్ రౌడీ” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 16, 2021 8:27 pm IST

సంపూర్ణేష్ బాబు హీరోగా, మహేశ్వరీ వడ్డి హీరోయిన్ గా డి. వసంత నాగేశ్వర రావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బజార్ రౌడీ. ఈ చిత్రం ఆగస్ట్ 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ బజార్ రౌడీ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 17 వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వారాంతం విడుదల అవుతుండటం తో అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కామెడీ మరియు యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ చిత్రం లో సంపూర్నేష్ మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు.

సంబంధిత సమాచారం :