
‘భలే భలే మగాడివోయ్’.. నాని హీరోగా, చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి రూపొందించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఏ సెంటర్స్, ఓవర్సీస్‌లో ఓ రేంజ్ వసూళ్ళను రాబట్టిన భలే భలే మగాడివోయ్ సినిమా ఇప్పటివరకూ 27 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.
ఒక మిడిల్ లెవెల్ బడ్జెట్‌లో రూపొందిన సినిమా ఇలా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి వసూళ్ళను రాబట్టడాన్ని విశేషంగానే చెప్పుకోవచ్చు. ఓ సరికొత్త కాన్సెప్ట్, మంచి కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ కోసం కూడా ఇప్పటికే పలు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు.

