రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ‘భలే భలే మగాడివోయ్’

రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ‘భలే భలే మగాడివోయ్’

Published on Aug 21, 2015 3:59 PM IST

Nani-and-Lavanya
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల్లో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. నిర్మాతగానూ పలు సినిమాలు చేసిన ఆయన, ఇండస్ట్రీలో తనదంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్నారు. తాజాగా మారుతి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలడన్న పేరు సంపాదించుకున్న యువ హీరో నానితో ‘భలే భలే మగాడివోయ్’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు అన్నికార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

టైటిల్, పోస్టర్స్‌తోనే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక విపరీతమైన క్రేజ్‌ను కూడా సంపాదించుకుంది. ఓ మతిమరుపు లవర్‌గా నాని ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ చూస్తే, సినిమా నూటికి నూరు పాళ్ళు నవ్విస్తుందనే విషయం స్పష్టమవుతూనే ఉంది. నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉండనుందని తెలుస్తోంది. గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ కూడా ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఇక విడుదలకు ముందే ఈ స్థాయి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా, త్వరలోనే సెన్సార్‌కు వెళ్ళనుందని సినిమా యూనిట్ తెలిపింది. సెప్టెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు