బీ రెడీ..”క్రాక్” నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుంది.!

Published on Oct 24, 2020 1:53 pm IST

తన లాస్ట్ చిత్రం “డిస్కో రాజా” ఫలితంతో సంబంధం లేకుండా మాస్ మహారాజ రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్టులను శరవేగంగా టేకప్ చేసి అంతే స్పీడ్ గా ముగించేస్తున్నారు. అలా ఆ చిత్రం అనంతరం తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో టేకప్ చేసిన మోస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “క్రాక్” తో భారీ అంచనాలు నెలకొల్పుకున్నారు.

పక్కా మాస్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అంతిమ దశలో ఉండగా చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ను వదులుతుంది. ఇపుడు అదే విధంగా మరో అదిరిపోయే అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి రానుంది అని దర్శకుడు గోపీచంద్ తెలిపారు.

రేపు ఉదయం 10 గంటల 5 నిమిషాలకు క్రాక్ అప్డేట్ పేలనుంది అని దర్శకుడు అలెర్ట్ చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అన్నది చూడాలి. ఈ చిత్రంలో మరోసారి రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More