రాజుగారి కోరిక మేరకు మాటలు రాశాను – మారుతి

రాజుగారి కోరిక మేరకు మాటలు రాశాను – మారుతి

Published on Jun 30, 2014 11:30 AM IST

Maruthi
సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో మాయాబజార్ మూవీస్ – మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘లవర్స్’. మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశి, మహేంద్ర బాబు నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ‘లవర్స్’ టీజర్ ను సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయిన నిర్మాత దామోదర ప్రసాద్(దాము) ఆడియో టీజర్ ను విడుదల చేశారు. అనంతరం ‘లవర్స్’ టీం సభ్యుల మధ్య సుమంత్ అశ్విన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ…. ‘లవర్స్’ సినిమా నిర్మాణ భాద్యతలను మాత్రమె నేను చూడాలనుకున్నాను. క్రియేటివ్ పరంగా స్క్రిప్ట్, డైరెక్షన్ వంటి విషయాలలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఎమ్మెస్ రాజుగారి కోరిక మేరకు స్క్రీన్-ప్లే, మాటలను అందించాను. జూలై 4న సమంత చేతుల మీద ఆడియో విడుదల చేసి, ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.

తాజా వార్తలు