జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ‘బీస్ట్’

Published on Jun 22, 2021 10:08 pm IST

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ నిన్ననే రివీల్ అయ్యాయి. విజయ్ 47వ పుట్టినరోజు సందర్బంగా వీటిని విడుదల చేశారు టీమ్. విజయ్ పవర్ఫుల్ లుక్, క్రేజీ టైటిల్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితమే మొదలైంది. మొదటి షెడ్యూల్ జార్జియాలో షూట్ చేశారు. చెన్నైలో లాక్ డౌన్ నిబంధనలు మెల్లగా సడలిస్తున్నారు. ఈ నెలాఖరుకు చాల వారికీ ఆంక్షలు ఎత్తివేస్తారు. అప్పుడు షూటింగ్లకు అనుమతులు కూడ లభిస్తాయి.

అందుకే ‘బీస్ట్’ టీమ్ జూలై 1వ తేదీ నుండి రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తోందట. ఇందుకోసం చెన్నైలో భారీ సెట్ నిర్మాణం కూడ జరుగుతోంది. ఈ షెడ్యూల్లోనే పూజా హెగ్డే కూడ జాయిన్ కానుంది. తమిళంలో పాటు తెలుగులో కూడ ఒకేసారి ఈ సినిమా విడుదలకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట టీమ్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :