సరిగ్గా ఫైనల్స్ లో ఈ కంటెస్టెంట్ వల్ల అఖిల్ కు దెబ్బ పడిందా.?

సరిగ్గా ఫైనల్స్ లో ఈ కంటెస్టెంట్ వల్ల అఖిల్ కు దెబ్బ పడిందా.?

Published on Dec 12, 2020 11:00 PM IST

Akhil Sarthak

ఈసారి రసవత్తరంగా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్స్ కు సమయం దగ్గర పడుతుండడంతో విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ చర్చగా మారింది. అయితే ఎప్పటి నుంచో టాప్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో ఒకడైన అఖిల్ నేరుగా ఫైనల్స్ టికెట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సరే అతడు ఫైనల్స్ కి వచ్చినా గెలుస్తాడా అన్న డౌట్ ఇప్పుడు చాలా మందిలో ఉంది. ఎందుకంటే దానికి ఒక గట్టి కారణమే ఉందని చెప్పొచ్చు. నిజానికి ఉయ్యాల టాస్క్ లో సోహెల్ తో పెద్దగా గొడవలు లేకుండానే మెయిన్ గా సోహెల్ త్యాగం వల్ల సింపుల్ గా ఫైనలిస్ట్ గా మారిపోయాడు. దీనితో అక్కడ నుంచి అఖిల్ కు పెర్ఫామ్ చెయ్యడానికి పెద్దగా స్కోప్ రాలేదు.

అలాగే మానిటర్ చేసే విషయంలో కూడా అఖిల్ నుంచి ఆకట్టుకునే ప్రదర్శన కూడా పెద్దగా కనిపించలేదు. మరి సోహెల్ వల్ల డైరెక్ట్ గా ఫైనల్స్ కు వెళ్లిన అఖిల్ కు అక్కడ నుంచి తన ఫాలోవర్స్ నుంచి ఓట్స్ పడినా జెనరల్ ఆడియెన్స్ నుంచి ఓటింగ్ కాస్త దూరం అయ్యిందని తెలుస్తుంది.

మరి దీనితో అఖిల్ కు విన్నింగ్ మూమెంట్ కాస్త దూరం అయ్యినట్టే అని చెప్పాలి. కానీ ఇంకో వారం మిగిలి ఉంది కాబట్టి ఈలోపల ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా హోప్స్ పెట్టుకోవచ్చు. మరి బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విజేతగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి అఖిల్ నిలవగలడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు