హుషారు సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది – నిర్మాత బెక్కం వేణు గోపాల్ !

Published on Apr 27, 2019 1:54 pm IST

గత ఏడాది హుషారు సినిమాతో హిట్ కొట్టాడు నిర్మాత బెక్కం వేణుగోపాల్. సక్సెఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆయన ఈ రోజు తన పుట్టినరోజుసందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు, ‘‘హుషారు’’ వేరు అందుకే ఆ సినిమా రిలీజ్ ముందు ఎక్కువ టెన్షన్ పడ్డాను. కానీ ఆతరువాత డబ్బులు వచ్చే సినిమా ఇచ్చావని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్స్ అంటుంటే చాలాగర్వ పడ్డాను. ‘‘హుషారు’’ సక్సెస్ నాకు కొండత ధైర్యాన్నిచ్చింది. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదన్నది అపోహ మాత్రమే, ఆ కొరత కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ చాలా థియేటర్స్ మంచి సినిమాల కోసం ఎదురు చూసాయి. సినిమా బాగుంటే మన సినిమా అన్ని థియేటర్స్ లో
కనపడుతుంది.

నిర్మాతగా దిల్ రాజు, రామానాయుడు నాకు ఆదర్శం. ఇక అలాగే ఈ యేడాది లక్కీ మీడియా బ్యానర్ నుండి కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాం. ఈ ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం :