బెల్లంకొండ గణేష్ హీరోగా మూవీ ప్రారంభం

బెల్లంకొండ గణేష్ హీరోగా మూవీ ప్రారంభం

Published on Oct 5, 2019 7:00 PM IST

bellam

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండ‌వ కుమారుడు గణేష్ హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది . గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ బీటెల్‌ప్రొడ‌క్ష‌న్స్ మ‌రియు ల‌క్కీమీడియా బ్యాన‌ర్ పై ప‌వ‌న్‌సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతున్న చిత్ర పూజా కార్య‌క్ర‌మం నేడు హైద‌రాబాద్ అన్న‌పూర్ణ‌స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డేరింగ్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అభిషేక్ నామ సురేష్‌బాబు, జెమినికిర‌ణ్‌, ఎంఎల్‌.ఎ. జీవ‌న్‌రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ చిత్రానికి సంగీతం రథన్ అందిస్తుండగా, వివేక్ ఆత్రేయ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో మంచి హీరోగా కొనసాగుతున్నారు.

తాజా వార్తలు