బెల్లంకొండ హీరో కొత్త సినిమా ప్రకటించాడు !

Published on Jan 3, 2019 9:30 am IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకొని మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల ‘కవచం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన కు ఈ చిత్రం అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఇక ఈ చిత్రం తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ నటించనున్న చిత్రాన్ని ఈరోజు సాయి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఈచిత్రం లో సాయి గడ్డం తో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. సత్యనారాయణ కోనేరు మరియు హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

X
More