వైల్డ్ రోల్ లో యంగ్ హీరో ?

వైల్డ్ రోల్ లో యంగ్ హీరో ?

Published on Mar 1, 2019 6:10 PM IST

Bellamkonda srinivas

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్స్ అఫీస్ వద్ద భారీ షేర్‌ ను రాబట్టుకుంది. దీంతో అజ‌య్ భూప‌తి తరువాత సినిమా పై కూడా భారీ అంచనాలు పెరిగాయి.

కాగా అజేయ్ భూపతి ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన రెండో సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగుతుందట. హీరో పాత్ర తాలూకు సన్నివేశాలు చాలా వైల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. మరి మొదటి సినిమాలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు