పవర్ ప్యాక్డ్ గా బెల్లంకొండ శ్రీనివాస్ “ఛత్రపతి” ట్రైలర్!

Published on May 2, 2023 2:25 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రభాస్ ను వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేసిన చిత్రమిది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీ లో అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్. ఈ చిత్రం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ తాజాగా ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పవర్ ప్యాక్డ్ గా ట్రైలర్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మే 12, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :