ప్రభాస్ మేకోవర్ లోకి మారిపోయిన బెల్లంకొండ శ్రీను.!

Published on Jul 16, 2021 7:21 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈరోజే తన మొట్టమొదటి బాలీవుడ్ సినిమాను స్టార్ట్ చేసాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే మంచి మాస్ హిట్ అయిన “ఛత్రపతి” రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మరి ఈరోజే ఒరిజినల్ ఛత్రపతి దర్శకుడు రాజమౌళి చేతులు మీదగా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

అయితే ఈ ముహూర్తంలో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అప్పుడు ఛత్రపతి మూవీలో ప్రభాస్ మేకోవర్ లోనే కనిపిస్తున్నాడు. తన ఫిజిక్ ఎలాగో సాలిడ్ గానే ఉంటుంది దానికి ఛత్రపతిలో ప్రభాస్ కి ఉండే శంఖం సేమ్ డ్రెస్సింగ్ లోకి మారిపోయాడు. మరి ఇవ్వన్నీ చూస్తుంటే ప్రభాస్ ని బాగానే ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. ఇక ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :