వినాయక్ భుజాల మీద మరొక భారం వేసిన బెల్లంకొండ ?

Published on Jun 12, 2021 12:45 am IST

బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో ఉన్న రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. వాటిలో ఒకటి హిందీలోకి రీమేక్ అవుతున్న తెలుగు ‘ఛత్రపతి’. దీన్ని వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ కూడ మొదలైంది. శ్రీనివాస్ హిందీలోకి డెబ్యూ అవుతున్న సినిమా కావడంతో భారీగా ఖర్చుపెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మూలంగా షూటింగ్ నిలిచిపోయింది. హైదరాబాద్లో వేసిన సెట్ కూడ వర్షాల కారణంగా దెబ్బతింది. మళ్లీ షూటింగ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఇంకొక రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట బెల్లంకొండ.

తమిళంలో ఇటీవల హిట్ అయిన ‘కర్ణన్’ రీమేక్ హక్కులను బెల్లకొండ కొని పెట్టుకున్నారు. హిందీ చిత్రం మొదలవ్వడానికి కాస్త సమయం పెట్టేలా ఉంది కాబట్టి ఈలోపు ఈ రీమేక్ ఫినిష్ చేయాలని చూస్తున్నారట. అది చేస్తే తెలుగులో కూడ సినిమా చేసినట్టు ఉంటుందని భావిస్తున్నారట. ఈ రీమేక్ బాధ్యతను కూడ వినాయక్ భుజాల మీదే పెట్టారని టీ టౌన్ టాక్. ‘ఛత్రపతి’ రీమేక్ మొదలవ్వడానికి టైమ్ ఉంది కనుక వినాయక్ చేతనే ఈ సినిమా చేయించాలని, అది ఫినిష్ అయ్యాక హిందీ ప్రాజెక్ట్ మీదకు మూవ్ అవ్వొచ్చనేది ప్లాన్ అట. మరి ఈ రీమేక్ ఆఫర్ ను వినాయక్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :