
‘కిక్ 2’తో తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచిన మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. అన్ని కార్యక్రమాలతో పాటు, అన్ని ఎరియాలకి ప్రింట్స్ రీచ్ అయిపోయిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లో అనగా రేపు(డిసెంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. సినిమా ట్రైలర్స్ క్రియేట్ చేసిన క్రేజ్ వలన ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగానే అవ్వడమే కాకుండా భారీ ఎత్తున రిలీజ్ కి కూడా సిద్దమైంది.
ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముందే బెంగాల్ టైగర్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. అది కూడా ఓ భారీ మొత్తానికి అమ్ముడు పోవడం విశేషం. ప్రముఖ టీవీ ఛానల్స్ మధ్య ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి భారీగా పోటీ నెలకొంది. ఫైనల్ గా జెమిని టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 7.5 కోట్లకి కొనుగోలు చేసారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ ఆఫర్ శాటిలైట్ రైట్స్ కి దక్కడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

