‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ

‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ

Published on Nov 9, 2015 6:59 PM IST

bengal-tiger
‘కిక్ 2’ తర్వాత మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘కిక్ 2’తో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రవితేజ, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో ‘బెంగాల్ టైగర్‌’ విషయంలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బెంగాల్ టైగర్‌ను రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించారు.

ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ఆడియో అభిమానులను బాగా అలరిస్తున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నా, అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుండడంతో, రెండు సినిమాలకూ ఒక్కరే అయిన పలువురు డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు, అదేవిధంగా పెద్ద సినిమాలకు గ్యాప్ ఉంటే మంచిదన్న ఆలోచనతో తమ సినిమాను నవంబర్ నెలాఖరుకు వాయిదా వేసినట్లు బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ తెలిపారు.

ప్రస్తుతం రిలీజ్ డేట్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, నవంబర్ 26న కానీ, 27న కానీ ఈ రెండు రోజుల్లో ఏదో ఒకరోజును రిలీజ్ డేట్‌గా ఫైనల్ చేస్తామని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక రవితేజ సరసన తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు